Expert Online Academy

Hi! 👋
Want to know more about our courses?
Click below to chat with our team.

Chat on WhatsApp

History of Kashmir Dynasties: కాశ్మీర్ దేశాన్ని పాలించిన రాజ వంశాలు

Share

History of Kashmir Dynasties:

రాజపుత్ర వంశాలు

కర్కోటక వంశం

రాజ్య స్థాపకుడు: దుర్లభ వర్ధనుడు గొప్పవాడు: లలితాదిత్య ముక్తాపీసుడు చివరి పాలకుడు: వినయాదిత్యుడు లలితాదిత్యుడు కాశ్మీర్లో మర్తాండ సూర్యదేవాలయం నిర్మించాడు. కాశ్మీర్ దేశ చరిత్ర తెలిపే రాజ తరంగిణిలో ఈ విషయం కలదు.

ఉత్పల వంశం

రాజ్య స్థాపకుడు: అవంతివర్మ 1.అవంతి వర్మ ఝలం నదిపై ఆనకట్ట నిర్మింపజేశాడు. అవంతి వర్మ ఆస్థాన కవి ఆనంద వర్ధనుడు ధ్వన్యాలోకం అనే సంస్కృత అలంకార గ్రంధం రచించాడు. చివరి పాలకుడు: శంకర వర్మ

లోహారా వంశం

రాజ్య స్థాపకుడు: యశస్కరుడు వీరి వంశ పాలనను అంతం చేసి క్రీ.శ. 1139లో షాహీ వంశం కాశ్మీర్ సింహాసనాన్ని ఆక్రమించింది. కాశ్మీర్ దేశాన్ని పాలించిన ఏకైక స్త్రీ పాలకురాలు దిద్దాదేవి.

E – Books Zone : https://eoaebookzone.blogspot.com

ఇతర వంశాలు 1 రాజధాని:

షామీరా వంశం

అల్లాఉద్దీన్పూర్(శ్రీనగర్) ఈ వంశంలో జైనుదిల్ అబదిన సుప్రసిద్ధ పాలకుడు. ఇతడిని కాశ్మీర్ అక్బర్గా పిలిచేవారు. ప్రముఖ శైవక్షేత్రం అమర్నాధ్ను సందర్శించాడు. ఉలార్ సరస్సులో జైనలంక అనే కృత్రిమ ద్వీపాన్ని నిర్మించాడు.. క్రీ.శ.12 నుండి 15 శతాబ్దం వరకు గల కాశ్మీర్ చరిత్రను వర్ణించే రాజతరంగిణి రెండవ భాగాన్ని (కల్హణుడి రాజతరంగిణికి కొనసాగింపుగా) జోనరాజ, శ్రీవర అనే పండితులు రచించారు.

షాహీ వంశం

రాజ్య స్థాపకుడు : లల్లియ షాహీ రాజధాని: ఉదబండా పూర్ లేదా ఊండ్ 1 అల్బెరూనీ రచనలు, రాజతరంగిణి వీరి సంబంధిత సమాచారాన్ని అందిస్తాయి. తురుష్క షాహీ, హిందూ షాహీ అనే రెండు శాఖలు ఈ వంశానికి సంబంధించినవి.

తురుష్క వంశం

కుషాణ వంశం నుండి వచ్చిన వారు. రాజధాని: కాబూల్ గాంధార, పంజాబ్లను పాలించారు. చివరి పాలకుడు లగితుర్మాన్.

హిందూషాహీ వంశం

కల్లర్ వంశస్తులను హిందూషాహీలుగా అల్బెరూని పేర్కొన్నాడు. రాజధాని: 1. ఉదబందాపురం, 2, త్రిభాండాపురం(భటింటా) జయపాలుడు సుప్రసిద్ధ పాలకుడు.. జయపాలుడి కాలంలో ముస్లింల దండయాత్రలు జరిగాయి. లంఘన్ యుద్ధంలో సభక్తజిన్ చేతిలో జయపాలుడి ఓటమి పాలైనాడు. 1 క్రీ.శ. 1001లో ఘజనీ మహ్మద్ చేతిలో ఓటమి చెందిన జయపాలుడు అవమాన భారంతో ఆత్మహత్య చేసుకున్నాడు. చివరి పాలకుడు భీమపాలుడు. ఇతడి మరణంతో హిందూషాహీ రాజ్యం ముస్లింల పరమైనది.

PRASHANTH KUMAR G
PRASHANTH KUMAR G

Digital Content Writer Telugu Having Subject Experience since 15+ years in Competitive Exams Sector And also having Content Writing Experience in General article writing.

Articles: 60