🎉 50% Discount on Courses! Enroll
British Rule in India: బ్రిటీష్ పాలన – ముఖ్యమైన చట్టాలు

British Rule in India:
రెగ్యులేటింగ్ చట్టం-1773
- భారతదేశంలో కేంద్రీకృత పాలనకు నాంది.
- బెంగాల్ గవర్నర్ పదవి ‘గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్’గా మార్పు. (నోట్: తొలి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్)
- బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీల గవర్నర్లు బెంగాల్ గవర్నర్ జనరల్ అధీనంలోకి మార్పు.
- 1774 కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పాటు.
పిట్స్ ఇండియా చట్టం-1784
- కంపెనీ వాణిజ్య, రాజకీయ విధుల విభజన.
- ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ ఏర్పాటు.
- వాణిజ్య వ్యవహారాల నిర్వహణకు గాను కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్‌కు అనుమతి.
- రాజకీయ వ్యవహారాల నిర్వహణకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏర్పాటు.
- సివిల్, మిలటరీ, రెవెన్యూ వ్యవహారాల నియంత్రణ బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌కు అప్పగింత.
E – Books Zone : https://eoaebookzone.blogspot.com

రెగ్యులేటింగ్ చట్టం-1813
- కంపెనీ సంబంధిత వ్యాపార, వాణిజ్య వ్యవహారాల గుత్తాధిపత్యంపై పాక్షిక రద్దు.
- భారతదేశంలో ఆంగ్ల విద్యావ్యాప్తికి సాలీనా 1 లక్ష రూపాయల కేటాయింపు.
- స్థానిక ప్రభుత్వాలకు పన్ను విధించు స్వేచ్ఛ.
ఛార్టర్ చట్టం-1833
- బ్రిటిష్ పరిపాలనా ప్రాంతాల్లో అధికారం తొలిసారిగా భారత ప్రభుత్వ పరిధిలోకి తేవడం.
- గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ప్రకటన. (నోట్: లార్డ్ విలియం బెంటింక్ తొలి భారత గవర్నర్ జనరల్.)
- బాంబే, మద్రాస్ గవర్నర్ల శాసనాధికారాల రద్దు.
- బ్రిటిష్ ఇండియాలోని శాసనాధికారాలన్నీ భారత గవర్నర్ జనరల్‌కు సంక్రమింపజేశారు.
- వాణిజ్య సమితిగా ఉన్న ఈస్టిండియా కంపెనీ పరిపాలనా సమితిగా మార్చబడింది.

ఛార్టర్ చట్టం-1853
- గవర్నర్ జనరల్ కౌన్సిల్ శాసనాధికారాలు, కార్య నిర్వహణాధికారాలను వేరు చేసింది.
- ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు.
- సివిల్ సర్వెంట్ల ఎంపికకుగాను బహిరంగ పోటీ వ్యవస్థ ఏర్పాటు. పోటీ పరీక్షల్లో భారతీయులకు సైతం అవకాశం కల్పించబడినది. (నోట్: 1854లో ఇండియన్ సివిల్ సర్వీస్‌పై మేకాలే కమిటీ ఏర్పాటు చేయబడినది.)
- తొలిసారిగా కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రాంతీయ ప్రాతినిధ్య గుర్తింపు.






