NCLT President: యామక కమిటీ (ACC) ఆమోదం: NCLT బలోపేతంపై జస్టిస్ గ్రెవాల్ నజర్

NCLT President: NCLT అధ్యక్షుడిగా జస్టిస్ అనుపిందర్ సింగ్ గ్రెవాల్ నియామకం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) నూతన అధ్యక్షుడిగా రిటైర్డ్ జస్టిస్ అనుపిందర్ సింగ్ గ్రెవాల్ నియమితులయ్యారు. ఐదు సంవత్సరాల కాలపరిమితి లేదా 67 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.. గతంలో ఆయన పంజాబ్ మరియు హర్యానా హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా పనిచేశారు. కేంద్ర కేబినెట్ నియామక కమిటీ (ACC) ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. సుమారు 30 ఏళ్ల పాటు న్యాయ వ్యవస్థలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. దివాలా ప్రక్రియ (Insolvency) కేసుల పరిష్కారంలో ఎన్సీఎల్టీ కీలక పాత్ర పోషిస్తుంది. వరుస ఖాళీలు మరియు జాప్యంతో సతమతమవుతున్న ట్రిబ్యునల్ ను ఆయన బలోపేతం చేయాల్సి ఉంది.
E – Books Zone : https://eoaebookzone.blogspot.com







