Expert Online Academy

Hi! 👋
Want to know more about our courses?
Click below to chat with our team.

Chat on WhatsApp

Governor Generals of India: భారతదేశ గవర్నర్ జనరల్స్

Share

Governor Generals of India:

సర్ చార్లెస్ మెట్‌కాఫ్ (1835-1836)

  • భారతదేశంలో పత్రికలపై ఆంక్షలను తొలగించి నూతన పత్రిక చట్టాన్ని ఆమోదించాడు.
  • 1823లో లైసెన్సింగ్ చట్టాన్ని రద్దు చేశాడు.
  • భారతదేశ పత్రికా రంగానికి స్వేచ్ఛను ప్రసాదించిన వాడిగా ప్రసిద్ధి.
  • 1836లో కలకత్తా పబ్లిక్ లైబ్రరీని ప్రారంభించాడు.
    లార్డ్ ఆక్లాండ్ (1836-1842)
  • ఇతని కాలంలో రంజిత్ సింగ్ మరణించాడు.
  • 1838లో దోస్త్ మహమ్మద్ ఖాన్‌కు వ్యతిరేకంగా బ్రిటిష్, షాషుజా, రంజిత్ సింగ్‌ల మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది.
  • మొదటి ఆఫ్గన్ యుద్ధంలో బ్రిటిష్‌వారి పరాజయం ఫలితంగా పదవి కోల్పోయాడు.
  • బ్యాంక్ ఆఫ్ బాంబే ఏర్పాటు చేయబడింది. (తరువాత కాలంలో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్పు చేయబడింది. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పిలువబడుతున్నది.)
    లార్డ్ ఎలెన్‌బరో (1842-44)

లార్డ్ ఎలెన్‌బరో (1842-44)

  • 1843లో బానిసత్వం రద్దు చేశాడు.
  • ఇతని కాలంలో మొదటి ఆఫ్గన్ యుద్ధం ముగిసింది.
  • సింధును బ్రిటిష్ ఇండియాలో విలీనం చేశాడు (1843).
  • గ్వాలియర్ యుద్ధం (1843)లో పాల్గొన్నాడు.
    లార్డ్ హార్డింజ్-1 (1844-48)
  • ఇతని కాలంలో మొదటి సిక్కు యుద్ధం (1845-46) జరిగింది.
  • ఆంగ్ల మాధ్యమంలో చదివిన భారతీయులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాడు.
  • రూర్కీ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేశాడు (1847).
  • బాలికా శిశువధను, నరబలిని అణచివేశాడు.

E – Books Zone : https://eoaebookzone.blogspot.com

లార్డ్ డల్హౌసీ (1848-56)

  • రెండో సిక్కు యుద్ధం తర్వాత పంజాబ్‌ను ఆక్రమించాడు.
  • రెండో బర్మా యుద్ధం తర్వాత బర్మా దిగువ ప్రాంతాన్ని ఆక్రమించాడు.
  • రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి సతారా, సంబల్‌పూర్, ఝాన్సీ, నాగ్‌పూర్‌ను ఆక్రమించాడు.
  • అయోధ్యను ఆక్రమించాడు.
  • ఇతని హయాంలో వితంతు పునర్వివాహ చట్టాన్ని ప్రవేశపెట్టారు.
  • ఇతని కాలంలో సంతాలుల తిరుగుబాటు జరిగింది.
  • ప్రతి రాష్ట్రంలో పబ్లిక్ వర్క్స్ శాఖను ప్రవేశపెట్టాడు.
  • 1854లో చార్లెస్ ఉడ్స్ అధ్యక్షుడిగా విద్యకు సంబంధించిన అంశాలపై కమిటీ ఏర్పాటు చేశాడు.
  • 1853లో రైల్వే, తంతి తపాలా, రోడ్డు రవాణా సౌకర్యాలు ప్రవేశపెట్టాడు.
  • 1854లో మొదటిసారిగా తపాలా బిళ్ళలను ప్రవేశపెట్టాడు.
  • పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంటును ఏర్పాటు చేశాడు.
  • 1853లో చార్టర్ చట్టంతో పోటీ పరీక్షలను ప్రవేశపెట్టారు.
  • 1854లో బొంబాయిలో మొదటి నూలు మిల్లు, కలకత్తాలో జనపనార మిల్లును స్థాపించారు.

లార్డ్ కానింగ్ (1856-57)

  • ఇతని కాలంలోనే సిపాయిల తిరుగుబాటు (1857) జరిగింది.
  • 1857లో కలకత్తా, బొంబాయి, మద్రాసులో విశ్వవిద్యాలయాలు స్థాపించాడు.
PRASHANTH KUMAR G
PRASHANTH KUMAR G

Digital Content Writer Telugu Having Subject Experience since 15+ years in Competitive Exams Sector And also having Content Writing Experience in General article writing.

Articles: 60