PM E-DRIVE Scheme: ఎలక్ట్రిక్ రవాణా ప్రోత్సాహం

PM E-DRIVE Scheme: కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి PM E-DRIVE పథకాన్ని మార్చి 31, 2028 వరకు పొడిగించింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 14,000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ టూ వీలర్లు, త్రీ వీలర్లు మరియు ఇ-అంబులెన్స్లకు ఈ పథకం కింద భారీ సబ్సిడీలు అందిస్తారు. వినియోగదారులలో ఉన్న ‘రేంజ్ యాంగ్జైటీ’ (ఛార్జింగ్ సమస్య) తొలగించడానికి పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణానికి నిధులు కేటాయించారు. గతంలో ఉన్న EMPS-2024 పథకాన్ని కూడా ఇందులో విలీనం చేశారు. కాలుష్య రహిత రవాణా వ్యవస్థను నిర్మించడం మరియు శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం దీని ప్రధాన లక్ష్యం. ఇది దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమకు (EV Industry) గొప్ప ఊతాన్నిస్తుంది.
E – Books Zone : https://eoaebookzone.blogspot.com







