1857 Sepoy Mutiny: 1857 సిపాయిల తిరుగుబాటు – ప్రధాన కారణాలు

1857 Sepoy Mutiny:
- ఆర్థిక కారణాలు
శిస్తులు, పన్నుల భారాల వల్ల రైతులు రుణ గ్రస్తులవడం.
దేశీయ వస్తువులపై అధిక సుంకాలు విధించడం.
శిస్తుల వసూలులో బ్రిటీష్ వారి అతి దారుణ విధానాలు.
వడ్డీ వ్యాపారస్తులు, ఇతర వ్యాపారస్తులు భూ స్వాములుగా అవతరించడం.
- రాజకీయ కారణాలు
సైన్య సహకార పద్ధతి, రాజ్య సంక్రమణ సిద్ధాంతం.
పరిపాలన సరిగా లేదనే నెపంతో బ్రిటీష్ వారు 1856లో అవధ్ ను ఆక్రమించడం.
స్వదేశీ రాజుల అధికారాన్ని హస్తగతం చేసుకోవడంతో పాటు వారికిచ్చే భరణం రద్దు చేయడం.
రాజ్యసంక్రమణ సిద్ధాంతం ప్రకారం సతారా (1848), నాగపూర్ (1853), ఝాన్సీ (1854) రాజ్యాలను ఆక్రమించడం. - సామాజిక-మత కారణాలు
మత మార్పిడి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వదంతులు వ్యాపించడం.
E – Books Zone : https://eoaebookzone.blogspot.com

సతీసహగమన నిషేధ, బాల్య వివాహాల రద్దు చట్టం చేయడం.
దేవాలయాలు, మసీదులపై ప్రభుత్వం విధించిన పన్నులు.
మత మార్పిడి చట్టం 1856లో సూచించిన అంశాలు.
- ఇతర కారణాలు
బ్రిటీష్ కంపెనీ పాలనలో పెచ్చు పెరిగిన అవినీతి.
మొదటి ఆఫ్గన్, పంజాబ్, క్రిమియా యుద్ధాలు, సంతాల్‌ల తిరుగుబాటులో కలిగిన నష్టాన్ని బ్రిటీష్ వారు భారతీయులపై వేయడం.
తక్షణ కారణం: భారతీయ సిపాయిలలో కలిగిన అసంతృప్తి.
ముఖ్య గమనిక: 1857 సిపాయిల తిరుగుబాటును భారత ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంగా వి.డి. సావర్కర్ పేర్కొన్నారు.






