Expert Online Academy

Hi! 👋
Want to know more about our courses?
Click below to chat with our team.

Chat on WhatsApp

British Rule in India: బ్రిటీష్ పాలన – ముఖ్యమైన చట్టాలు

Share

British Rule in India:

రెగ్యులేటింగ్ చట్టం-1773

  • భారతదేశంలో కేంద్రీకృత పాలనకు నాంది.
  • బెంగాల్ గవర్నర్ పదవి ‘గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌’గా మార్పు. (నోట్: తొలి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్)
  • బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీల గవర్నర్లు బెంగాల్ గవర్నర్ జనరల్ అధీనంలోకి మార్పు.
  • 1774 కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పాటు.

పిట్స్ ఇండియా చట్టం-1784

  • కంపెనీ వాణిజ్య, రాజకీయ విధుల విభజన.
  • ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ ఏర్పాటు.
  • వాణిజ్య వ్యవహారాల నిర్వహణకు గాను కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్‌కు అనుమతి.
  • రాజకీయ వ్యవహారాల నిర్వహణకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏర్పాటు.
  • సివిల్, మిలటరీ, రెవెన్యూ వ్యవహారాల నియంత్రణ బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌కు అప్పగింత.

E – Books Zone : https://eoaebookzone.blogspot.com

British Rule in India

రెగ్యులేటింగ్ చట్టం-1813

  • కంపెనీ సంబంధిత వ్యాపార, వాణిజ్య వ్యవహారాల గుత్తాధిపత్యంపై పాక్షిక రద్దు.
  • భారతదేశంలో ఆంగ్ల విద్యావ్యాప్తికి సాలీనా 1 లక్ష రూపాయల కేటాయింపు.
  • స్థానిక ప్రభుత్వాలకు పన్ను విధించు స్వేచ్ఛ.

ఛార్టర్ చట్టం-1833

  • బ్రిటిష్ పరిపాలనా ప్రాంతాల్లో అధికారం తొలిసారిగా భారత ప్రభుత్వ పరిధిలోకి తేవడం.
  • గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ప్రకటన. (నోట్: లార్డ్ విలియం బెంటింక్ తొలి భారత గవర్నర్ జనరల్.)
  • బాంబే, మద్రాస్ గవర్నర్ల శాసనాధికారాల రద్దు.
  • బ్రిటిష్ ఇండియాలోని శాసనాధికారాలన్నీ భారత గవర్నర్ జనరల్‌కు సంక్రమింపజేశారు.
  • వాణిజ్య సమితిగా ఉన్న ఈస్టిండియా కంపెనీ పరిపాలనా సమితిగా మార్చబడింది.
British Rule in India

ఛార్టర్ చట్టం-1853

  • గవర్నర్ జనరల్ కౌన్సిల్ శాసనాధికారాలు, కార్య నిర్వహణాధికారాలను వేరు చేసింది.
  • ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు.
  • సివిల్ సర్వెంట్ల ఎంపికకుగాను బహిరంగ పోటీ వ్యవస్థ ఏర్పాటు. పోటీ పరీక్షల్లో భారతీయులకు సైతం అవకాశం కల్పించబడినది. (నోట్: 1854లో ఇండియన్ సివిల్ సర్వీస్‌పై మేకాలే కమిటీ ఏర్పాటు చేయబడినది.)
  • తొలిసారిగా కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ప్రాంతీయ ప్రాతినిధ్య గుర్తింపు.

PRASHANTH KUMAR G
PRASHANTH KUMAR G

Digital Content Writer Telugu Having Subject Experience since 15+ years in Competitive Exams Sector And also having Content Writing Experience in General article writing.

Articles: 60