Expert Online Academy

Hi! 👋
Want to know more about our courses?
Click below to chat with our team.

Chat on WhatsApp

NTPC and EDF France MoU 2026: NTPC మరియు ఫ్రాన్స్‌కు చెందిన EDF మధ్య అణు విద్యుత్ ఒప్పందం

Share

NTPC and EDF France MoU 2026: భారతదేశంలో అణు విద్యుత్ సహకారాన్ని అన్వేషించేందుకు ఫ్రాన్స్కు చెందిన EDFS
అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న NTPC

సారాంశం:

భారతదేశంలో అణు విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధిలో సహకారాన్ని అన్వేషించడానికి ఏప్రిల్ 2026లో, NTPC లిమిటెడ్ ఫ్రాన్స్కు చెందిన ఎలెక్ట్రిసైట్ డి ఫ్రాన్స్ (EDF)తో ఒక వ్యూహాత్మక నాన్-బైండింగ్ అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై NTPC చీఫ్ జనరల్ మేనేజర్ (న్యూక్లియర్ సెల్) అర్నద ప్రసాద్ సమాల్ మరియు EDF ఇంటర్నేషనల్ న్యూక్లియర్ డెవలప్మెంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వకిసాసి రమణీ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం కింద, భారతదేశంలో అనుకూలత కోసం EDF యొక్క యూరోపియన్ ప్రెజరైజ్డ్ రియాక్టర్ (EPR) సాంకేతికత యొక్క సాధ్యాసాధ్యాలను రెండు కంపెనీలు సంయుక్తంగా అంచనా వేస్తాయి.

Read Also : Maurya Dynasty: మౌర్య సామ్రాజ్య స్థాపన: చంద్రగుప్త మౌర్యుడు మరియు బిందుసారుని వీరగాథ

NTPC and EDF France MoU 2026:

ప్రాముఖ్యత:

NTPC and EDF France MoU 2026: వికసిత్ భారత్ కింద 2047 నాటికి 100 GW లక్ష్యంగా భారతదేశం భారీ స్థాయిలో అణుశక్తిని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్న తరుణంలో, NTPC-EDF సహకారం అదునాతన EPR రియాక్టర్. సాంకేతికతను వినియోగించుకోవడానికి తలుపులు తెరుస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్న రష్యన్ మరియు అమెరికా విధానాలకు అతీతంగా అణు భాగస్వామ్యాలను విస్తరించడానికి భారతదేశానికి అవకాశం సంకేతం కల్పిస్తుంది. అణుశక్తి రంగంలోకి NTPC ప్రవేశం, దేశంలో అణు విద్యుత్ ఉత్పత్తి వాణిజ్యీకరణకు బలమైన ANKERS AD
వాస్తవిక దత్తాంశాలు:→ గణాంకాలు: NTPC వ్యవస్థాపక సామర్థ్యం: 89 GW+; నిర్మాణంలో ఉన్న అదనపు సామర్థ్యం: 32 GW; 2032 సామర్థ్య లక్ష్యం: 149 GW (60GW పునరుత్పాదక ఇంధనంతో కలిపి); EPR రియాక్టర్ పరిమాణం: సాధారణంగా 1,600 MW.
→ముఖ్య వ్యక్తులు: అర్నద ప్రసాద్ సమాల్ – CGM (న్యూక్లియర్ సెల్), NTPC; వకిసాసి రమణీ సీనియర్ VP (ఇంటర్నేషనల్ న్యూక్లియర్ డెవలప్ మెంట్), EDF,→ స్టాటిక్ GK: NTPC – నేషనల్ ధర్మల్ పవర్ కార్పొరేషన్ (భారతదేశపు అతిపెద్ద విద్యుత్ సంస్థ: విద్యుత్ మంత్రిత్వ శాఖ కింద PSU; 1975లో స్థాపన: ప్రధాన కార్యాలయం: న్యూఢిల్లీ); EDF Électricité de France (ఫ్రెంచ్ బహుళజాతి విద్యుత్ సంస్థ; ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది; ప్రధాన కార్యాలయం: పారిస్); EPR -యూరోపియన్ ప్రెజరైజ్డ్ రియాక్టర్ (EDF-Framatome రూపొందించిన జనరేషన్ |||+ డిజైన్; మొదటి EPR ఆపరేషనల్: తైషాన్, చైనా, 2018); పౌర అణు ఒప్పందం మద్దతుతో అణుశక్తిలో భారత్- ప్రాన్స్ ద్వైపాక్షిక సహకారం: ఉమ్మడి అణు అభివృద్ధి కోసం న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL)తో కూడా NTPC ఒప్పందం కుదుర్చుకుంది.
→ ప్రదేశం: న్యూఢిల్లీ (NTPC ప్రధాన కార్యాలయం); పారిస్, ప్రాన్స్ (EDF ప్రధాన కార్యాలయం).

E – Books Zone : https://eoaebookzone.blogspot.com

PRASHANTH KUMAR G
PRASHANTH KUMAR G

Digital Content Writer Telugu Having Subject Experience since 15+ years in Competitive Exams Sector And also having Content Writing Experience in General article writing.

Articles: 45