Recherla Padmanayaka History: రాచకొండ, దేవరకొండ రాజ్యాల సమగ్ర చరిత్ర

Recherla Padmanayaka History: రేచర్ల పద్మనాయకుల రాచకొండ రాజ్యం హిందూ రాజ్య పునఃప్రతిష్టాపన తరువాత ఏర్పడిన స్వతంత్ర రాజ్యం . రేచర్ల వంశీయులు కాకతీయుల కాలంలో సుప్రసిద్ధులైనారు. పద్మనాయకులనే వెలమలని కూడా అంటారు. వీరి పరిపాలనా కాలం సుమారు 150 సంవత్సరాలు. వీరి మొట్టమొదటి రాజధాని రాచకొండ. ఇది తెలంగాణాలోని నల్గొండ జిల్లాలో ఉన్నది. వీరి రెండో రాజధాని దేవరకొండ. ఇది కూడా నల్గొండ జిల్లాలోనే ఉన్నది.
పూర్వ చరిత్ర
రేచర్ల పద్మనాయకుల చరిత్రకు ప్రధాన ఆధారము వెలుగోటి వంశావళి. దీని ప్రకారం రేచర్ల వంశానికి మూలపురుషుడు భేతాళరెడ్డి. ఈ కాలంలో రేచర్ల గోత్రికులు పిల్లలమర్రిని పాలించేవారు. రేచర్ల వంశీయులలో దామానాయుడు, ప్రసాదిత్యనాయుడు, రుద్ర నాయకుడు అనేవారు కాకతి గణపతిదేవుని కొలువులో పని చేసేవారు. వీరిలో ప్రసాదిత్యనాయుడు కాకతి సింహాసనంపై రుద్రమదేవిని అధిష్టింపచేసి ‘కాకతి రామరాజ్యస్థాపనాచార్య, ‘రాయ పితామహాంక’ అనే బిరుదులను కూడా పొందాడు.
E – Books Zone : https://eoaebookzone.blogspot.com

వెన్నమనాయని కుమారుడు ఎరదాచానాయుడు, అతని కుమారుడు సింగమనాయకుడు కాకతి ప్రతాపరుద్రుని సేనానులు. క్రీ.శ. 1316లో ప్రతాపరుద్రుని కాంచీపుర దండయాత్రలో పాల్గొన్న దాచానాయుడు ముప్పడి నాయకునితో పోరాడి విజయం సాధించి ‘పంచపాండ్యదళ విభాళ’ అనే బిరుదును పొందాడు. సింగమ నాయకుడు తన శౌర్య ప్రతాపాలతో ప్రతాపరుద్రుని మెప్పించి 80 వరాలను పొంది ‘అశీతివరాల సింగమనాయకుడ’ని ప్రసిద్ధి పొందాడు.
Recherla Padmanayaka History: సింగమనాయకుడు
ఓరుగల్లును ముస్లింలు ఆక్రమించిన తరువాత ఆంధ్ర నాయకులు ప్రోలయ నాయకుని నాయకత్వంలో లేవదీసిన విముక్తి ఉద్యమంలో సింగమనాయకుడు పాల్గొన్నాడు. ఓరుగల్లును ముస్లింలు ఆక్రమించిన తరువాత ఆంధ్ర నాయకులు ప్రోలయనాయకుని నాయకత్వంలో లేవదీసిన ఉద్యమంలో సింగమనాయకుడు పాల్గొన్నాడు.
ముస్లింల పాలన నుండి ఆంధ్రదేశం విముక్తి పొందిన తరువాత తెలుగు నాయకులు స్వార్థపరులై విడిపోయి స్వతంత్రరాజ్యాలను స్థాపించుకొన్నారు. కాపయనాయకుడు బహమనీ సుల్తానుతో పోరాడే సమయంలో సింగమనాయకుడు దక్షిణదిశలోని నాయకులను జయించి కృష్ణాతీరం వరకు గల రాజ్యాన్ని ఆక్రమించాడు.

కృష్ణా, తుంగభద్రా, అంతర్వేదిలోని కొన్ని దుర్గాలు, నల్గొండ జిల్లాలోని ఏలేశ్వరం సింగమనాయకుని వశమైనాయి. రాజ్య విస్తరణ ప్రయత్నంలోనే సింగమనాయకుడు జల్లిపల్లి కోటను ముట్టడించి సోమవంశ క్షత్రియులచేత చంపబడినాడు.
అనవోతా నాయకుడు
రాచకొండ రాజ్య నిర్మాత ఇతడే. తన రాజధానిని అనుమనగల్లు నుండి రాచకొండ మార్చాడు. తన తండ్రి మరణానికి ప్రతీకారంగా జల్లిపల్లి పై దండెత్తి సోమవంశ రాజులను సంహరించి వారి రక్తంతో తన తండ్రికి తర్పణం సమర్పించి ‘సోమకుల పరశురామ’ బిరుదాన్ని సంపాదించాడు. ఈ యుద్ధంలో అనవోతా నాయకుని తమ్ముడు మాదా నాయకుడు కూడా పాల్గొన్నాడు.
జల్లిపల్లి దండయాత్ర తరువాత అనవోతా నాయకుడు రాచకొండను దుర్భేద్యమైన దుర్గంగా మార్చి రాజధానిని అనుమనగల్లు నుండి రాచకొండకు మార్చాడు. తరువాత కాపయనాయకునిపై దండెత్తి క్రీ.శ. 1368లో వరంగల్లు జిల్లాలోని భీమవరం వద్ద జరిగిన యుద్ధంలో కాపయనాయకుని సంహరించి ఓరుగల్లును ఆక్రమించాడు.
Read also: Satavahana Dynasty History: గౌతమీపుత్ర శాతకర్ణి చరిత్ర మరియు విజయాలు

ఓరుగల్లు రాజ్యం రేచర్ల వెలమ నాయకుల వశమైంది. అనవోతా నాయకునికి ‘ఆంధ్ర దేశాధీశ్వర’ బిరుదు లభించింది. అప్పటి నుండి తెలంగాణా ప్రాంతాన్ని రాచకొండ పద్మనాయకులు సుమారు 100 సంవత్సరాలు పాలించారు. అనవోతానాయకుడు సాధించిన విజయాలవల్ల రేచర్ల వెలమల రాజ్యానికి ఉత్తరాన గోదావరి, దక్షిణాన శ్రీశైలం, పశ్చిమాన బహమనీ రాజ్యం , తూర్పున కొండవీటి రెడ్డి రాజ్యాం సరిహద్దులైనాయి. రేచర్ల పద్మనాయకులు బహమనీ సుల్తానులతో మైత్రి కలిగిఉన్నారు.
ఉభయ రాజ్యాల మధ్య రాజకీయ సంబంధాలు సవ్యంగానే ఉన్నట్లు పద్మనాయకులు రాజులైన దగ్గర నుండి బహమనీ సుల్తానులు తెలంగాణా పై దండెత్తక పోవటంవల్ల తెలుస్తుంది. పరిపాలనా సౌలభ్యం కోసం అనవోతా నాయకుడు తన రాజ్యాన్ని రెండుగా విభజించి తన తమ్ముడైన మాదానాయని దేవరకొండ ప్రభువుగా నియమించాడు.
నాటి నుండి రాచకొండలో అనవోతా నాయకుని సంతతివారూ, దేవరకొండలో మాదానాయకుని సంతతివారు పరస్పర సహకారంతో పరిపాలించారు. రాచకొండ రాజ్యానికి దేవరకొండ రాజ్యం లోబడి ఉండేది.






